Tuesday, 10 December 2019

Poem which I like most




విధరరిపు గమనునికిని
విగళ సఖునికిని విమల విష శయనునికిన్
విభవభవ జనకునికిని
వికుచచను విషముఁ గొనుట విషమే తలపఁన్?


ప్రతిపదార్థం :

విషధర రిపు = గరుత్మంతునిపై {విషధర రిపుడు - విషధర (సర్పములకు) రిపుడు (శత్రువు), గరుత్మంతుడు};
గమనుని = విహరించువాని;
కిని = కి;
విషగళ = పరమశివుని {విషగళుడు - విషమును కంఠమున ధరించినవాడు, శంకరుడు};
సఖుని = స్నేహితుని;
కిని = కి;
విమల = నిర్మలమైన;
విషశయనుని = శేషశాయి {విషశయనుడు - విష (జలము)పై శయనుడు, విష్ణువు};
కిన్ = కి;
విషభవభవ = బ్రహ్మదేవుని {విషభవభవుడు - విష (నీటియందు) భవ (పుట్టెడిది) యైన పద్మమున భవ (పుట్టినవాడు), బ్రహ్మ};
జనకుని = తండ్రి;
కిని = కి;
విష = విషము పూసిన;
కుచ = స్తనముల;
చను =వెలువడు;
విషమున్ = విషమును;
కొనుట = తీసుకొనుట;
విషమే = కష్టమా, కాదు;
తలపన్ = తరచిచూసినచో.

భావం:

విషము కోరలలో ధరించే నాగులను చీల్చెడి గరుత్మంతుడు వాహనంగా కలవాడు, కంఠమున విషము ధరించెడి శంకరుని మిత్రుడు, ప్రళయకాలమున విషము (జలము)పై శయనించు నిర్మలమైన వాడు, విషము (నీటి) యందు పుట్టెడి పద్మము నందు జనించిన వాడైన బ్రహ్మదేవునికి తండ్రియైన వాడు అయినట్టి సాక్షాత్తు మహావిష్ణువు యైన ఈ బాలుడికి విషము చిమ్మే చన్నులతో తిరిగే ఒక రాకాసి విషం లాగివేయటం విషమ (పెద్ద కష్ట)మైన పనా, కానేకాదు.

నాకు బాగా నచ్చిన పోతన పద్యం